Osmania University Admissions : ఉస్మానియా యూనివర్సిటీ లో పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, ఆటొమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌, టర్బో మెషినరీ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి.

Graduate Program in Osmania University

Osmania University Admissions : ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (యూసీఈ) లో పార్ట్‌ టైం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌, కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కంటిన్యూయింగ్‌ ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌(సీఈఈపీ) కింద ఎంఈ/ఎంటెక్‌ అడ్మిషన్స్‌ నిర్వహించనున్నారు.

READ ALSO : AGRICET 2023 : బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ఏఎన్‌జీఆర్‌ఏయూ అగ్రిసెట్‌ 2023

ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు కాగా మొత్తం ఆరు సెమిస్టర్లు ఉంటాయి. సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, బయో మెడికల్‌, మైనింగ్‌ విభాగాల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.

సివిల్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించి స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ 20, జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌ 15, వాటర్‌ రిసోర్స్‌ ఇంజనీరింగ్‌ 15, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌ 15 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 30, సైబర్‌ సెక్యూరిటీ 15, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ 15 సీట్లు ఉన్నాయి.

READ ALSO : Monsoon Diet : వర్షాల్లో నాన వెజ్ తింటున్నారా… ఇది మీకోసమే

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, ఆటొమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌, టర్బో మెషినరీ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లో ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌ సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి.

ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో డిజిటల్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, సిస్టమ్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, మైక్రోవేవ్‌ అండ్‌ రాడార్‌ ఇంజనీరింగ్‌, వీఎల్‌ఎ్‌సఐ అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి.

READ ALSO : Kharif Chilli Cultivation : ఖరీఫ్ మిర్చి సాగుకు సిద్దమవుతున్న రైతులు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

బయో మెడికల్‌ ఎలకా్ట్రనిక్స్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి. ప్రతి ఇంజనీరింగ్‌ విభాగంలో 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లకు లోకల్‌, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు పోటీ పడవచ్చు.

అర్హత వివరాలు ;

స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/ఏఎంఐఈ/ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.2,000గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 29, 2023గా నిర్ణయించారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ను ఆగస్టు 13, 2023న నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌: www.uceou.edu