PhD Admission : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) విశాఖపట్నంలో పీహెచ్‌డీ 2023 స్పింగ్ సెషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. రెగ్యులర్, స్పాన్సర్డ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇండివిడ్యువల్ ఫెలోషిప్, క్యూఐపీ, ప్రాజెక్ట్ వంటి కేటగిరీల్లో అడ్మిషన్స్ నిర్వహించనున్నారు. బయోసైన్స్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగాల్లో పీహెచ్ డీ ప్రోగ్రామ్ లో ప్రవేశాలు పొందవచ్చు.
READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !
అర్హతలు విషయానికి వస్తే ;
సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎంఈ,ఎంటెక్,ఎమ్మెస్సీ,డ్యూయెల్ డిగ్రీ, బీఈ,బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. డిగ్రీ, పీజీ స్థాయుల్లో ప్రథమ శ్రేణి మార్కులు కలిగి ఉండాలి. నెట్,గేట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. అలాకాకుంటే ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు పొందిన డిగ్రీ కళాశాలల్లో కనీసం మూడేళ్ల బోధన అనుభవం కలిగి ఉండాలి. స్పాన్సర్డ్ అభ్యర్థులకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, కోల్, ఎర్త్ సైన్సెస్, కెమికల్ అండ్ ఫర్టిలైజర్, డిఫెన్స్ సంస్థలు, పీఎస్ యూలు, ఆర్ అండ్ డీ సంస్థలు, నేషనల్ ల్యాబొరేటరీలు, సంస్థ గుర్తింపు పొందిన ఇండస్ట్రీలలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అలాంటి వారు స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
READ ALSO : Vitamin D Deficiency : విటమిన్ డి లోపాన్ని నివారించటానికి సహాయపడే జీవనశైలి మార్పులు !
వ్యక్తిగత ఫెలోషిప్ కేటగిరీ కింద ప్రవేశం పొందాలంటే సీఎస్ఐఆర్,యూజీసీ, డీబీటీ,ఐసీఏఆర్,ఇన్‌స్పయిర్ నుంచి వ్యాలిడ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత కలిగి ఉండాలి. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐపీఈ, ఆర్‌జీఐపీటీ సంస్థలనుంచి కనీసం 8 సీజీపీఏతో బీటెక్,డ్యూయెల్ డిగ్రీ-బీటెక్ అండ్ ఎంటెక్,అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ,జామ్ స్కోర్‌తో రెండేళ్ల ఎమ్మెస్సీ పూర్తిచేసినవారికి నేరుగా పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్ల కాలం. గరిష్ఠంగా ఎనిమిదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌లో భాగంగా కోర్సు వర్క్, పబ్లికేషన్ ఆఫ్ రిసెర్చ్ వర్క్, సెమినార్‌లు, కాంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్, వైవా, అవార్డ్ ఆఫ్ పేటెంట్స్ ఉంటాయి. అకడమిక్ మెరిట్, ఎంట్రెన్స్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులకు ప్రవేశాలు కల్పిస్తారు.
READ ALSO : Karonda Cultivation : ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడి..పెట్టుబడి లేని కరొండ సాగు
రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్:
రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో చేరిన అభ్యర్థులకు గరిష్ఠంగా అయిదేళ్లపాటు రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్ అందిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000, తరవాత మూడేళ్లు నెలకు రూ.35,000 చెల్లించటం జరుగుతుంది. కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.30,000 అందజేస్తారు.
READ ALSO : Rabi Crops : వరికి ప్రత్యామ్నాయంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు
దరఖాస్తు వివరాలు ;
దరఖాస్తు ఫీజుగాను జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా నవంబరు 30గా నిర్ణయించారు. ఎంట్రెన్స్ టెస్ట్/ఇంటర్వ్యూను డిసెంబరు 7 నుంచి 11 తేది వరకు నిర్వహిస్తారు. ఎంపికైన వారి జాబితాను 2024 జనవరి 3న ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.iipe.ac.in పరిశీలించగలరు.