Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https//www.tgprb.in లో చూడాలని అధికారులు సూచించారు.
Jobs: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు పడ్డాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో ఉద్యోగాల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 60. ఫోరెన్సిక్ విభాగంలో సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 15. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https//www.tgprb.in లో చూడాలని అధికారులు సూచించారు.
పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు ఇంటర్ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే వాళ్లందరూ 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిగీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు కూడా పోస్టును, కేటగిరీని బట్టి మారుతుంది.
* సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఫిజికల్/జనరల్ 2
* కెమికల్ 3
* బయాలజీ/సెరోలజీ 3
* కంప్యూటర్స్ 2 పోస్టులు..
* సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్/జనరల్ 5
* కెమికల్ 10
* బయాలజీ/సెరోలజీ 10
* కంప్యూటర్స్ 7 పోస్టులు ఉన్నాయి.
* ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో ఫిజికల్/జనరల్ 2, కెమికల్ 6, బయాలజీ/సెరోలజీ 4, కంప్యూటర్స్ 5 పోస్టులు ఉన్నాయి.
* ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టు.
పోస్టులు బట్టి జీతం మారుతుంది. రూ.45వేల నుంచి లక్ష 24వేల 150 రూపాయలుగా వేతనం ఉంది.
