Hcl Technologies, Noida
HCL Technologies : నోయిడాలోని హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) టెక్నాలజీస్‌లో టెక్ బీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. హైదరాబాద్, విజయవాడ సహా నోయిడా, లఖ్‌నవూ, నాగ్‌పూర్, చెన్నైలలో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.10,000రూ స్టయిపెండ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,డిజైన్ ఇంజనీర్‌గా ఉద్యోగావకాశం కల్పిస్తారు.సంస్థ నిర్వహించే కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేషన్ కోర్సులకయ్యే ఖర్చును నిబంధనల ప్రకారం సంస్థ భరిస్తుంది.
డెవలప్ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కోడింగ్, టెస్టింగ్ ఇంజనీర్, అనలిస్ట్, ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్, డిటెక్టింగ్ బగ్స్ అండ్ రన్నింగ్ డయాగ్నస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, రిసెర్చ్ అండ్ డెవల్‌ప్‌మెంట్, డిజైన్ ఇంజనీర్, ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్ డిజైన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, వెబ్ సర్వర్ డెప్లాయ్‌మెంట్, ప్రాసెస్ ఆటొమేషన్, సెక్యూరిటీ పాలసీ ఇంప్లిమెంటేషన్ తదితర విభాగాల్లో ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అర్హత: మేథమెటిక్స్, బిజినెస్ మేథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్, తత్సమాన పరీక్ష (2021/2022) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:hcltechbee.com పరిశీలించగలరు.