NIMS Admissions : నిమ్స్ హైద్రబాద్ లో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన కళాశాల నుండి బీఎస్సీ,(నర్సింగ్, సైకాలజీ, లైఫ్ సైన్సెస్, డయాలజిస్ టెక్నాలజీ) ఎంబీబీఎస్, ఎండీ, హాస్పిటల్ అడ్మినిస్టేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.

NIMS Admissions

NIMS Admissions : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నెఫ్రాలజీ విభాగం ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్ ప్రోగ్రామ్ లో సర్టిఫికెట్ కోర్సు అందిస్తుంది. ఈ కోర్సులో ప్రవేశానికి ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఏడాది కాల వ్యవధి కలిగిన ఫుల్ టైం ప్రోగ్రామ్ లో నాలుగు సీట్లు ఉన్నాయి.

READ ALSO : Five States Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లెన్ని? అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లు కావాలి.. పూర్తి వివరాలు ఇలా..

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన కళాశాల నుండి బీఎస్సీ,(నర్సింగ్, సైకాలజీ, లైఫ్ సైన్సెస్, డయాలజిస్ టెక్నాలజీ) ఎంబీబీఎస్, ఎండీ, హాస్పిటల్ అడ్మినిస్టేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయసు 20 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. నిభంధనల ప్రకారం వయోపరిమితి వర్తిస్తుంది.

READ ALSO : CID Notices : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి పేరును చేర్చిన సీఐడీ

అభ్యర్ధుల ఎంపిక ఎట్రన్స్ టెస్ట్ ద్వారా ఉంటుంది. పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దరఖాస్తు పీజుగా జనరల్ , బీసీ అభ్యర్ధులకు రూ.5000 , ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ 4,000గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆక్టోబర్ 31 ఆఖరు తేదిగా నిర్ణయించారు. దరఖాస్తు హార్డు కాపీలను పంపేందుకు నవంబరు 3 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;www.nims.edu.in పరిశీలించగలరు.