AgniVeer vayu 2025 Notifications
ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ 2025 నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా జూలై 11 నుంచి జూలై 31 వరకు కొనసాగనుంది. దాంతో చాలా మంచి అభ్యర్తిలు ఇప్పటికే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఆసక్తు గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు. దేశ సేవలో భాగం కావాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
వయోపరిమితి: ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 21 ఏళ్ళు మించకూడదు. జనవరి 1, 2006 నుంచి జూలై 1, 2009 మధ్య జన్మించిన వారై ఉండాలి.
విద్యార్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులు (గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్) చదివిన అభ్యర్థులై ఉండాలి. 10+2 లేదా ఇంటర్ తత్సమాన పరీక్షలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లీష్‌లో కూడా 50% మార్కులు సాదించాలి. గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీల నుండి ఇంజినీరింగ్ సంబంధిత బ్రాంచ్‌లలో 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఆరోగ్య ప్రమాణాలు: పురుష, మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరాఖండ్ లాంటి కొండ ప్రాంతాలకు చెందిన వారికి 147 సెం.మీ వరకు మినహాయింపు ఉంది. లక్షద్వీప్ ప్రాంతానికి చెందిన అభ్యర్థుల కనీస ఎత్తు 150 సెం.మీ ఉండాలి.
దరఖాస్తు రుసుము: అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.550 + GST చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఈ ప్రక్రియ మూడు దశలుగా ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్. వీటిలో అభ్యర్థులు కనబరిచిన ఉత్తమ ప్రదర్శన ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.