AIIMS Recruitment 2025: ఎయిమ్స్‌ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. 3501 పోస్టుల భర్తీ.. అర్హత, దరఖాస్తు పూర్తి వివరాలు

AIIMS Recruitment 2025: ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) 3501 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

AIIMS Recruitment 2025 Notification Released

గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) 3501 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, యూడీసీ, ఎంటీఎస్, గ్రూప్ బీ, సీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, హెల్త్ కేర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ జూలై 12న ప్రారంభమై 31 జూలై తో ముగుస్తుంది. ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్ aiimsexams.ac.in ద్వారా ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
స్టెనోగ్రాఫర్ పోస్టులు 221, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 702, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ పోస్టులు 371, ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టులు 38, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ / టెక్నీషియన్ పోస్టులు 195, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు 144 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 48 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి:
అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 40 ఏళ్లు ఉండాలి. పోస్టును బట్టి వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం కూడా వయోపరిమితిలో మార్పులు ఉంటాయి.

విద్యార్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హతలు పోస్టును బట్టి మారుతూ ఉంటాయి. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఫార్మసీ, బీఎస్సీ, Btech, ఎమ్మెస్సీ, MCA తదితర అర్హతలు ఉన్నరందరూ అర్హులే.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3000, ఎస్సీ/ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారు రూ.2400 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.

పరీక్షా తేదీ వివరాలు:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీటీ) 2025 ఆగస్టు 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ అడ్మిట్ కార్డు, తేదీలను తర్వాత ప్రకటిస్తారు.