AAI JOB VACANCIES : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగ ఖాళీల భర్తీ

. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, వైద్య, ఫిజికల్‌ టెస్ట్‌, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Airports Authority of India

AAI JOB VACANCIES : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 456 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) 132 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) 10 ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్‌) 13 ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్(అధికారిక భాష) 1 పోస్టు ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, వైద్య, ఫిజికల్‌ టెస్ట్‌, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి 92,000, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.36,000 నుంచి 1,10,000 వరకు చెల్లిస్తారు.

అభ్యర్ధుల ఎంపికకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ప్రక్రియ 01 సెప్టెంబరు2022న ప్రారంభమై 30సెప్టెంబరు 2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.aai.aero/en/recruitmentపరిశీలించగలరు.