Job Vacancies : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ ఎంఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

All India Institute of Medical Sciences in Jodhpur, Rajasthan

Job Vacancies : రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈనోటిఫికేషన్ ద్వారా అనస్థీషియాలజీ అండ్‌ క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, డయాగ్నోస్టిక్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆఫ్తాల్మాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ ఎంఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

అకడమిక్‌ మెరిట్‌/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఫిబ్రవరి 3, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsjodhpur.edu.in పరిశీలించలరు.