AIIMS Mangalagiri Recruitment :
AIIMS Mangalagiri Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్, ట్రామా ఎమర్జెన్సీ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ /మెడిసిన్ /సీడియాట్రిక్స్ /ఆప్తమాలజీ/ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్ లేదా తత్సమాన స్పెషలైజేషన్లో ఎంబీ/డీఎన్బీ/సర్జరీలో ఎమ్‌ఎస్/ఎమ్‌సీహెచ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 29, 2022వ తేదీన ఉదయం 8 గంటలకు సంబంధిత డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsmangalagiri.edu.in/ పరిశీలించగలరు.