AIIMS Raebareli Recruitment : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్ బరేలిలో పోస్టుల భర్తీ

బయోకెమిస్ట్రీ, యూరాలజీ, మైక్రోబయాలజీ, ట్రాన్స్ ప్యూజన్ మెడిసిన్, పాథాలజీ, పీఎంఆర్, సైకియాట్రీ, రేడియాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండీ,ఎంఎస్, డీఎన్ బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

AIIMS Raebareli Recruitment

AIIMS Raebareli Recruitment : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయబరేలిలో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

బయోకెమిస్ట్రీ, యూరాలజీ, మైక్రోబయాలజీ, ట్రాన్స్ ప్యూజన్ మెడిసిన్, పాథాలజీ, పీఎంఆర్, సైకియాట్రీ, రేడియాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండీ,ఎంఎస్, డీఎన్ బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 45 ఏళ్ళలోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష అధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 67,700 చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 7, 2023ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsrbl.edu.in/recruitments పరిశీలించగలరు.