AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 10 జులై 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

All India Institute of Medical Sciences

AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) రాయపూర్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 169 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పెడియాట్రిక్స్‌ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

READ ALSO : Kadwa Badam : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడే కద్వా బాదం !

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించరాదు.

READ ALSO : Blood Donation : రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే !

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 10 జులై 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsraipur.edu.in/ పరిశీలించగలరు.