ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES
AIIMS Deoghar Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) దియోఘర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 33 సంవత్సరాలు లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజుగా యూఆర్ అభ్యర్థులకు రూ. 3000, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000.గా నిర్ణయించారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
READ ALSO : Betel Plantations : తగ్గిపోతున్న తమలపాకు తోటల సాగు
సరైన అర్హతలు గల అభ్యర్థులు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును నేరుగా సెప్టెంబర్ 10, 2023లోపు సమర్పించవచ్చు. దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్ ఆఫీస్, AIIMS దేవిపూర్, పర్మనెంట్ క్యాంపస్, డియోఘర్- 814152 (జార్ఖండ్). పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsdeoghar.edu.in/ పరిశీలించగలరు.