Medical Doctor Applications : ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

AP Govt Medical Doctor Posts : మెడికల్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు ఏపీ ప్రభుత్వం పొడిగించింది.

Medical Doctor Applications : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎమ్వీ సూర్యకళ తెలిపారు. మెడికల్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు ఏపీ ప్రభుత్వం పొడిగించింది.

వైద్యుల పోస్టులకు దరఖాస్తు గడువు డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 16 వరకు పెంచింది. 97 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, 280 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 2న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ (http:apmsrb.ap.gov.in/msrb/)లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also : Allu Arjun : ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్.. విడుదలయ్యేది ఎప్పుడంటే..