NEET UG Counselling 2024 : ఏపీ నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024.. అర్హత పొందిన అభ్యర్థుల జాబితా, కట్-ఆఫ్ స్కోర్లు విడుదల

NEET UG Counselling 2024 : ఏపీ నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024 అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను చెక్ చేయొచ్చు. అధికారిక ఏపీ నీట్ యూజీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Andhra Pradesh NEET UG Counselling 2024

NEET UG Counselling 2024 : ఏపీ నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024 : డాక్టర్ వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఎలిజిబిలిటీ క్యుములేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (AP NEET) 2024కి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

Read Also : Real TDR Projects : భారం తగ్గనుంది.. టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్న హెచ్ఎండీఏ

మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (drysruhs.edu.in)ని విజిట్ చేయడం ద్వారా ఏపీ నీట్ యూజీ 2024 అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను చెక్ చేసి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024.. కేటగిరీ వారీగా కట్-ఆఫ్ మార్కులు ఇలా ఉన్నాయి.

UR/EWS: 720-162
OBC: 161-127
SC: 161-127
ST: 161-127
UR/EWS & PwBD: 161-144
OBC & PwBD: 143-127
SC & PwBD: 143-127
ST & PwBD: 142-127

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం :
“ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ అయింది. యూనివర్శిటీ నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అప్‌డేట్‌ల కోసం ఔత్సాహికులు క్రమం తప్పకుండా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చెక్ చేయాలి.

    • ఏపీ నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024 అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను చెక్ చేయొచ్చు.
    • అధికారిక ఏపీ నీట్ యూజీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
    • హోమ్‌పేజీలో, “Whats New” సెక్షన్‌కు వెళ్లండి
    • “నీట్ యూజీ 2024 – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి హాజరైన అర్హత కలిగిన అభ్యర్థులు”పై క్లిక్ చేయండి.
    • అభ్యర్థుల జాబితా నెక్స్ట్ పేజీలో డిస్‌ప్లే అవుతుంది.
    • ఈ జాబితాలో కట్-ఆఫ్ స్కోర్‌లను చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.
    • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.

రాష్ట్ర మెరిట్ ర్యాంక్, అభ్యర్థులు నింపిన ఎంపికల ఆధారంగా నీట్ స్కోర్ ఆధారంగా సీట్ల కేటాయింపు జాబితా ప్రచురిస్తుంది. అభ్యర్థులు తమ సీట్లను నిర్ధారించుకోవడానికి కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నీట్ అనేది దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ (MBBS), ఆయుష్ (BAMS, BUMS, BHMS, మొదలైనవి), డెంటల్ (BDS) కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష. దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.

Read Also : Oppo A3X 5G Launch : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఒప్పో A3x 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే..!

ట్రెండింగ్ వార్తలు