AP ECET 2025 Counselling: ఏపీ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల… ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు మీకోసం

AP ECET 2025 Counselling: బీటెక్‌ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు ఏపీ ఈసెట్‌ - 2025 పరీక్ష ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబందించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల అయ్యింది.

Ap Ecet 2025 Counselling schedule released

బీటెక్‌ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు ఏపీ ఈసెట్‌ – 2025 పరీక్ష ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబందించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన చేశారు. జూలై 4 నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. జూలై 8 వరకు ఫీజు చెల్లింపులు, జూలై 13వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఏపీ ఈసెట్‌ – 2025 ముఖ్యమైన తేదీలు:

జులై 4 నుంచి ఏపీ ఈసెట్‌ – 2025 కౌన్సెలింగ్‌
జూలై 8 వరకు ఫీజు చెల్లింపులు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
జూలై 4 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల అప్ లోడ్ ప్రక్రియ
జూలై 7 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక జరుగుతుంది.
జూలై 11న వెబ్ ఆప్షన్స్ ఛేంజింగ్ కోసం అవకాశం
జూలై 13న సీట్ల కేటాయింపు.
సీట్లు పొందిన విద్యార్థులు 14 నుంచి 17 లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. లేదంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది.
జూలై 14 నుంచి తరగతులు మొదలవుతాయి.