AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీ

ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 439 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

జిల్లాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే అనంతపురం ఖాళీలు 30, చిత్తూరు ఖాళీలు 42, తూర్పు గోదావరి ఖాళీలు 26, గుంటూరు ఖాళీలు 72, వైఎస్ఆర్ కడప ఖాళీలు 25, కృష్ణా ఖాళీలు 50, కర్నూలు ఖాళీలు 23, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఖాళీలు, 22, ప్రకాశం ఖాళీలు 27, శ్రీకాకుళం ఖాళీలు 49, విశాఖపట్నం ఖాళీలు, 40, విజయనగరం ఖాళీలు 22 ,పశ్చిమ గోదావరి ఖాళీలు 11 ఉన్నాయి.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://hc.ap.nic.in/recruitment.html

ట్రెండింగ్ వార్తలు