ఆంధ్రా యూనివర్సిటీ PG ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ (AUEET) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం (మే 16, 2019)న ఉదయం 11.30 గంటలకు వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు.
ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లతోపాటు ర్యాంకులను కూడా వెల్లడించారు.
సబ్జెక్టుల వారీగా టాపర్లు…
ఆంధ్రవిశ్వవిద్యాలయం 14 కోర్సుల్లో పరీక్షలు నిర్వహించింది. సైన్స్ కోర్సులో జియాలజీలో 91 మార్కులతో అబ్దుల్ లతీఫ్ టాపర్‌గా నిలిచాడు. ఆర్ట్స్ కోర్సుల్లో 86 మార్కులతో వాసాగణపతిరావు టాపర్‌గా నిలిచాడు. ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో తంగిరాల జయశ్రీలక్ష్మీ సావిత్రి టాపర్‌గా నిలిచారు. పరీక్షల అనంతరం ఐదురోజుల్లోనే రికార్డు స్ధాయిలో ఫలితాలు విడుదల చేశామని వీసీ జి.నాగేశ్వరరావు తెలిపారు.