Anganwadi Worker, Helper Posts Recruitment in Anantapuram District
Anganwadi Posts Recruitment : అనంతపురం జిల్లా పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్ వాడీ కేంద్రాల్లో అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో అంగన్ వాడీ వర్కర్, మినీ అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్ధినుల అర్హతలకు సంబంధించి పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపికైన అంగన్ వాడీ వర్కర్ కు నెలకు 11,500రూ, మినీ అంగన్ వాడీ వర్కర్ కు 7,000రూ , అంగన్ వాడీ హెల్పర్ కు 7000రూ చెల్లిస్తారు. దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన ఆఖరు తేది 13 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; సీడీపీవో కార్యాలయం, అనంతపురం జిల్లా అనే చిరునామాకు పంపాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://wdcw.ap.gov.in/ పరిశీలించగలరు.