AGRICET 2023
AGRICET 2023 : గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ)-‘అగ్రిసెట్ 2023’ నోటిఫికేషన్ ద్వారా అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ విభాగాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. వ్యవసాయ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు
ఈ ఎగ్జామ్‌లో సాధించిన మార్కుల అధారంగా నాలుగేళ్ల వ్యవధి గల బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్స్ కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, అనుబంధ అగ్రికల్చరల్ కళాశాలల్లో నిర్దేశిత సీట్లు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు
పాలిటెక్నిక్ వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల కోసం ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో 162 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 48 సీట్లు చొప్పున మొత్తం 210 సీట్లు భర్తీ చేయనున్నారు. అదే క్రమంలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో అగ్రికల్చర్ అభ్యర్థులకు 133 సీట్లు, సీడ్ టెక్నాలజీ అభ్యర్థులకు 23 సీట్లు, ఆర్గానిక్ ఫార్మింగ్ అభ్యర్థులకు 6 సీట్లు ఉన్నాయి. అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద అగ్రికల్చర్ అభ్యర్థులకు 39 సీట్లు, సీడ్ టెక్నాలజీ అభ్యర్థులకు 7 సీట్లు, ఆర్గానిక్ ఫార్మింగ్ అభ్యర్థులకు 2 సీట్లు భర్తీ చేయనున్నారు.
READ ALSO : Prevent Hair Loss : వర్షాకాలం జుట్టు రాలకుండా ఉండాలంటే ?
దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే ఏఎన్‌జీఆర్‌ఏయూ/పీజేటీఎ్‌సఏయూ నుంచి రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా(అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్) పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 22 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు; దివ్యాంగులకు 27 ఏళ్లు మించరాదు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులకు రూ.1400, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700గా నిర్ణయించారు.
READ ALSO : Monsoon Diet : వర్షాల్లో నాన వెజ్ తింటున్నారా… ఇది మీకోసమే
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5, 2023గా నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్ కాపీని ఆగస్టు 16, 2023లో గా కన్వీనర్-అగ్రిసెట్ 2023, అసోసియేట్ డీన్, అగ్రికల్చరల్ కాలేజ్, బాపట్ల – 522101 పంపాల్సి ఉంటుంది. ఏఎన్‌జీఆర్‌ఏయూ అగ్రిసెట్ 2023 పరీక్ష సెప్టెంబరు 1న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: angrau.ac.in పరిశీలించగలరు.