రంగా వర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష తేదీ ఖరారు

  • Publish Date - May 15, 2019 / 10:13 AM IST

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) 115 జూనియర్‌ అసిస్టెంట్‌ కం టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రధాన పరీక్ష ను మే 31న నిర్వహించనున్నట్టు APPSC మే 14న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. మొదటి పరీక్ష ఉదయం , రెండో పరీక్ష మధ్యాహ్నం  సెషన్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. 

అసలు ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29న మెయిన్ పరీక్ష నిర్వహించాలి కానీ కొన్ని కారణాల వల్ల పరీక్షను వాయిదా వేసింది. ఈ సందర్భంగా మే 31న పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.