గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీతో పాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మార్చి 6లోగా దరఖాస్తు ఫీజు రూ.1500 చెల్లి్ంచాల్సి ఉంటుంది. ST, SC, దివ్యాంగులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది. మార్చి 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 115 పోస్టులు (పాతవి-21, కొత్తవి-94)
* వయసు పరిమితి:
అభ్యర్థుల వయసు 01.07.2019 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
* అర్హత:
డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ సైన్స్), డిప్లొమా (కంప్యూటర్ సైన్స్) లేదా BCA ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్ (లోయర్ గ్రేడ్) ఉత్తీర్ణత తప్పనిసరి.
* ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష ఆధారంగా.
* ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | ఫిబ్రవరి 15, 2019. |
ఫీజు చెల్లించడానికి చివరితేది | మార్చి 06, 2019. |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | మార్చి 07, 2019. |
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.