APPSC Recruitment : ఏపి ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆయుష్ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

APPSC Recruitment : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మెడికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 మెడికల్‌ ఆఫీసర్‌ యునాని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆయుష్ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్‌ ప్రాక్టీషర్‌గా పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్ సైట్ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు