AP Police SI Recruitment
AP Police SI Recruitment : ఏపీలో సివిల్, ఎపిఎస్పి SI పోస్టుల భర్తీకి సంబంధించి ఫైనల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ / ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PMT / PET) పూర్తి చేసుకుని ఈవెంట్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ వ్రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.
అక్టోబర్ 14 , 15 తేదీల్లో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆమేరకు బోర్డు షెడ్యూల్ ను విడుదల చేసింది. విశాఖ, ఏలూరు, గుంటూరు కర్నూల్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
అక్టోబర్ 14వ తేది ఉదయం 10 నుండి 1గంటవరకు మొదటి పేపరు, అదే రోజు మద్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు రెండో పేపరు పరీక్ష జరుగుతుంది. అక్టోబరు 15వ తేదిన ఉదయం 10 నుండి 1గంటవరకు మూడవ పేపరు, అదే రోజు మద్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు నాల్గవ పేపరు పరీక్ష నిర్వహించనున్నారు.
final-exam