Ap Degree Admissions: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం అర్హులైన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల గడువు రేపటితో అంటే సెప్టెంబర్ 1తో ముగియనుంది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. కాబట్టి, మరోసారి పొడిగించే అవకాశం ఉండదని విద్యార్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు కోరారు. రిజిస్ట్రేషన్(Ap Degree Admissions) కోసం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://oamdc.ucanapply.com/ వెళ్లి చేసుకోవాలని సూచించారు. ఇక రిజిస్ట్రేషన్ కిశోరం ఓసీ విద్యార్థులు రూ.400, బీసీలు రూ.300 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 ఫీజు పే చేయాలి.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
సెప్టెంబర్ 1: రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్
సెప్టెంబర్ 2: వెబ్ ఒప్షన్స్ అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్ 3: వెబ్ ఒప్షన్స్ ఎడిటింగ్ కోసం అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్ 6: సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 8: డిగ్రీ తరగతులు ప్రారంభం.