AP EAPCET 2025 Counselling: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

AP EAPCET 2025 Counselling: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 (AP EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

AP EAPCET 2025 Counselling started

ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 (AP EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈఏపీసెట్‌ లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఆన్లైన్ https://eapcet-sche.aptonline.in/EAPCET/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు జులై 16 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

ముఖ్యమైన తేదీలు, మరిన్ని వివరాలు:

ధృవపత్రాల ఆన్‌లైన్ పరిశీలన: జులై 17 వరకు కొనసాగుతుంది.

వెబ్ ఆప్షన్ల నమోదు: అభ్యర్థులు జులై 13వ తేదీ నుంచి 18 వరకు చేసుకోవచ్చు

వెబ్ ఆప్షన్లలో మార్పు: జులై 19న ఏమైనా మార్పులు ఉంటె చేసుకోవచ్చు.

సీట్ల కేటాయింపు ఫలితాలు: మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను జులై 22న ప్రకటిస్తారు.

కళాశాలల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన అభ్యర్థులు జులై 23 నుంచి 26 లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్టింగ్ చేసుకొవాలి.

తరగతుల ప్రారంభం: ఆగస్టు 4 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

కౌన్సిలింగ్ ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.