AP ECET 2025 final phase registration process has begun.
ఏపీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తవగా.. తాజాగా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://ecet-sche.aptonline.in లోకి వెళ్లి ఫీజు చెల్లించి, వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని ప్రకటన చేశారు అధికారులు.
ఏపీ ఈసెట్ 2025లో అర్హత సాధించిన పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్య్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలను కల్పిస్తారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు రిజర్వేషన్లను కూడా ఆధారంగా చేసుకొని సీట్ల కేటాయింపు చేస్తారు.