AP ECET 2025: ఏపీ ఈసెట్ 2025 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. ఇవాళే లాస్ట్ డేట్.. అలాట్మెంట్, రిపోర్టింగ్ వివరాలు మీకొసం

AP ECET 2025: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు.

AP ECET 2025 final phase seat allocation completed

ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ecet.sche.aptonline.in ద్వారా తమకు అలాట్ అయిన కళాశాల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే, అలాగే సీట్లు పొందిన విద్యార్థులు జులై 25 లోగా సెల్ఫ్ ఆన్లైన్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీ అలాట్మెంట్ వివరాలు ఇలా తెలుసుకొండి:

  • విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ ecet-sche.aptonline.in/ECET లోకి వెళ్ళాలి
  • హోమ్‌పేజీలో కేటాయింపు ఆర్డర్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ఇక్క‌డ‌ మీ లాగిన్ వివ‌రాల‌ను ఎంటర్ చేయాలి
  • ఇప్పుడు మీ అలాట్మెంట్ ఆర్డర్ డిస్ప్లే అవుతుంది.
  • అందులో ఈ రిపోర్టింగ్, అడ్మిషన్ వివ‌రాలు ఉంటాయి.
  • తదుపరి అవసరాల కోసం డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవాలి.

ముందుగా చెప్పినట్టుగానే సీటు పొందిన విద్యార్థులు జూలై 23వ తేదీ నుంచి జూలై 25వ తేదీ మధ్యలో ఆన్‌లైన్ రిపోర్టింగ్, కళాశాలలో డైరెక్ట్ రిపోర్టింగ్ చేసుకోవాలి. లేదా కేటాయించిన సీటు క్యాన్సిల్ అవుతుంది.