AP Government : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల

ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

APPSC Group 2 Notification (Photo : Google)

ఎట్టకేలకు నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 10వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది.

వివిధ విభాగాల్లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఇవాళే(డిసెంబర్ 7) నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సుధీర్ ఎక్స్(ట్విట్టర్) లో తెలిపారు. నియామక ప్రక్రియను త్వరగా ప్రారంభించి, నిర్ణీత గడువులోగా ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే నోటిఫికేషన్ విడుదలైంది.

Also Read : డిగ్రీ పాస్ అయితే చాలు.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగం

గ్రూప్ 2 పోస్టులు.. ఏ విభాగంలో ఎన్నంటే..
రాష్ట్రంలో 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. నూతన సిలబస్ ప్రకారమే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందన్నారు. ఆ తర్వాత మెయిన్ పరీక్ష తేదీని ప్రకటిస్తామన్నారు అధికారులు.

ఎక్సైజ్ ఎస్ఐ-150
డిప్యూటీ తహసీల్దార్-114
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-218
జూనియర్ అసిస్టెంట్-31
మొత్తం 59 విభాగాల్లో పోస్టుల భర్తీ

గ్రూప్-2 నోటిఫికేషన్.. కీలక వివరాలు
* గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
* డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు
* నూతన సిలబస్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష
* మొత్తం 897 పోస్టులు భర్తీ
* ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
*ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరణ
* గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) ఫిబ్రవరి 25న నిర్వహణ
* ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్‌ పరీక్షకు షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు
* మెయిన్‌ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు

Also Read : సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్(CBHFL)లో ఉద్యోగ ఖాళీల భర్తీ

* మెయిన్‌ రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు
* స్క్రీనింగ్ పరీక్ష ఆఫ్‌లైన్‌ మోడ్ ‌(ఓఎంఆర్‌)లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది
* మెయిన్‌ పరీక్ష కూడా ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే నిర్వహిస్తారు

 

ట్రెండింగ్ వార్తలు