AP ICET రిజల్ట్స్ : గుంటూరు వాసికి ఫస్ట్ ర్యాంకు

  • Publish Date - May 8, 2019 / 12:20 PM IST

AP ICET రిజల్ట్స్ వచ్చేశాయి. మే 08వ తేదీ  బుధవారం విజయవాడలోని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ 2019 టెస్టును శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం టెస్టును నిర్వహించిన సంగతి తెలిసిందే. 90.27 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఫలితాల వివరాలను వెబ్ సైట్‌లో ఉంచారు. మే 15వ తేదీ నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. 

https://sche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx

ఇక ఫలితాల్లో గుంటూరుకు చెందిన కారుమూరి నాగసుమంత్ మొదటి ర్యాంకులో నిలిచాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కావ్య శ్రీ రెండో ర్యాంకు, విజయవాడకు చెందిన శివసాయి పవన్ మూడో ర్యాంకు సాధించారు. MCA, MBA లలో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు 48,445 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఏప్రిల్ 26న ఏపీ ICET పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెషన్లలో జరిగింది. ఈ పరీక్షకు 52,736 మంది దరఖాస్తు చేసుకోగా, 48,445 మంది హాజరయ్యారు. ఏప్రిల్ 27 ఐసెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం మే 8న ఫలితాలను రిలీజ్ చేశారు.