AP ICET 2025 Counselling: ఏపీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచే.. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు మొదలు.. పూర్తి వివరాలు 320

AP ICET 2025 Counselling: ఏపీ ఐసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 10) నుంచి మొదలుకానుంది.

Ap Icet 2025 Counselling starts from today

ఏపీ ఐసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 10) నుంచి మొదలుకానుంది. ఈ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుంది. ఇక వెబ్ ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియ జూలై 13 నుంచి జూలై 16 వరకు కొనసాగుతుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

  • జూలై 11 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన.
  • జూలై 17 నుంచి వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
  • జూలై 19వ తేదీన ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.
  • సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 20వ తేదీ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • ఈ గడువు జూలై 22వ తేదీతో పూర్తవుతుంది.
  • రిపోర్టింగ్ చేయకపోతే కేటాయించిన సీటు రద్దు చేస్తారు.
  • జూలై 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఇక ఏపీ ఐసెట్ 2025 పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు అధికారులు. సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ కారణం వల్లనైనా రిపోర్టింగ్ చేసుకోకపోతే కేటాయించిన సీటు రద్దు అవుతుంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలు:

  • ఏపీ ఐసెట్ 2025 హాల్ టికెట్
  • ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డు
  • టీసీ
  • డిగ్రీ మెమో
  • డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్
  • ఇంటర్ మెమో
  • పదో తరగతి మెమో
  • స్టడీ సర్టిఫికెట్లు
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్ కార్జు
  • కుల ధ్రువీకరణపత్రం
  • ఈడబ్యూఎస్ ధ్రువీకరణపత్రం
  • స్థానికత సర్టిఫికెట్ తో పాటు ఇతర పత్రాలు.