ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలపై డౌట్ అన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవేరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో రీవేరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, రీవేరిఫికేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అడిగిన వివరాలు ఇచ్చి, ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు
రీకౌంటింగ్, రీవేరిఫికేషన్ కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
సమాధాన పత్ర రీవేరిఫికేషన్ కోసం ఫీజు రూ.1300
సమాధాన పత్ర రీకౌంటింగ్ కోసం ఫీజు రూ.260
Also Read: ఇంటర్ ఫెయిలైన వారికి సప్లిమెంటరీ ఎప్పుడు? ఫీజులు ఎప్పుడు, ఎంత కట్టాలి?
కాగా, ఇంటర్మీడియట్ పరీక్షలను మొత్తం 10,17,102 మంది విద్యార్థులు రాశారు. రిజల్ట్స్‌ను 10tv.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా కూడా ఫలితాలు పొందొచ్చు. ఈ ఏడాది ఫస్టియర్ పరీక్షలు మార్చి 19న ఫస్టియర్ పరీక్షలు ముగియగా, మార్చి 20న సెకండియర్ పరీక్షలు ముగిశాయి.
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతం ఉత్తీర్ణత శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అనకాపల్లితో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా 73 శాతం ఉత్తీర్ణత శాతంతో చివరి స్థానంలో ఉంది. ప్రథమ సంవత్సర ఫలితాల్లోనూ కృష్ణా జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో ఉంది. చివరి స్థానంలో చిత్తూరు (54 శాతం) నిలిచింది.
ఫలితాలు ఇలా