ఇంటర్ ఫెయిలైన వారికి సప్లిమెంటరీ ఎప్పుడు? ఫీజులు ఎప్పుడు, ఎంత కట్టాలి?

ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకుడా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలను శనివారం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ ఏడాదిలో 70 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ ద్వితీయ ఏడాదిలో 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకుడా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మార్కులు మరింత పెంచుకోవడానికి కూడా పరీక్షలు రాయవచ్చు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సప్లిమెంటరీ పరీక్షల (IPASE) వివరాలు

ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు 12-05-2025 నుంచి 20-05-2025 వరకు రెండు సెషన్లలో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు), (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు) జరుగుతాయి

ప్రాక్టికల్ పరీక్షలు 28-05-2025 నుంచి 01-06-2025 వరకు జిల్లా ప్రధాన కార్యాలయంలో మాత్రమే నిర్వహిస్తారు.

పరీక్షల ఫీజులు 15-04-2025 నుంచి 22-04-2025 వరకు చెల్లించవచ్చు

Also Read: ఇంటర్‌ ఫలితాల్లో టాప్ జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు ఇవే..

పరీక్ష ఫీజు వివరాలు

1. జనరల్ / వొకేషనల్ కోర్సుల థియరీ పేపర్ల పరీక్ష ఫీజు (పేపర్ల సంఖ్యతో సంబంధం లేకుండా) – రూ.600
2. జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ (2వ సంవత్సరం మాత్రమే)/వొకేషనల్ కోర్సుల (1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం) (పేపర్ల సంఖ్యతో సంబంధం లేకుండా) పరీక్ష ఫీజు – రూ.275
3. జనరల్ / వొకేషనల్ బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు (బైపీసీ విద్యార్థులకు గణితం సహా) రూ.165
4. వొకేషనల్ బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు రూ.275/-