ఏపీ లాసెట్ – 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విషయాన్నీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా వెల్లడించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు న్యాయ విద్య కాలేజీల్లోని మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in/LAWCET/ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.