AP Mega DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేడే.. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

AP Mega DSC 2025: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను సోమవారం (సెప్టెంబర్ 15) ఉదయం విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9.30 గంటలకు https://apdsc.apcfss.in/ సైట్ లో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అందుబాటులో ఉంచనున్నారు. 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు.

ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి మెగా డీఎస్సీ నియామకాలు. టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఉపాధ్యాయ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విద్యా శాఖ ఖరారు చేసిందిజ తుది ఎంపిక జాబితా సోమవారం విడుదల కానుంది.

ఈ నియామక ప్రక్రియలో మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివిధ దశల్లో జరిగింది. జూన్ 2 నుండి జూలై 2 వరకు నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత మెరిట్ జాబితా విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. విద్యా శాఖ అధికారులు ప్రస్తుతం తుది ఎంపిక జాబితాను విడుదల చేయడానికి, ఆ తర్వాత అపాయింట్ మెంట్ లెటర్లు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

సెప్టెంబర్ 19న విజయవాడలోని వెలగపూడిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నియామక పత్రాలను ప్రదానం చేయనున్నారు. 16వేల మంది నియామక అభ్యర్థులు, వారి సహచరులతో సహా సుమారు 32వేల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన ప్రతి అభ్యర్థితో పాటు ఒక సహాయకుడిని కూడా పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సహా దాదాపు 100,000 మందితో కూడిన పెద్ద సమావేశం కూడా జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే వారి కోసం రవాణ సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్.. రూ.15వేలు వచ్చేది వీరికే.. మార్గదర్శకాలు వచ్చేశాయ్.. 17నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డబ్బులొచ్చేది ఎప్పుడంటే..