గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ BPED, UGPED కోర్సుల్లో ప్రవేశానికి మే 4 నుండి 9 వరకు నిర్వహించిన AP PECET-2019 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నాగార్జున యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య విజయరాజు మే 15న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 96.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు మే 17 నుంచి తమ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన PECET పరీక్షలకు మొత్తం 2,081 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 2,001 మంది అర్హత సాధించారు. వీరిలో పురుషులు 1,559; మహిళలు 442 మంది ఉన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో పీసెట్ పరీక్షకు 1,349 మంది పరీక్షకు హాజరుకాగా 1,299 మంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 704 మంది పరీక్షకు హాజరుకాగా 676 మంది, నాన్‌లోకల్ విభాగంలో 28 మంది పరీక్షకు హాజరుకాగా 26 మంది అర్హత సాధించారు. టాప్-10 ర్యాంకుల్లో 8 ర్యాంకులు బాలికలకే వచ్చాయి.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…