AP Polycet final phase seat allocation on July 24th
ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా ఇవాళ (జూలై 24) ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://polycet.ap.gov.in/ ద్వారా అలాట్మెంట్ ఆర్డర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక సీటు పొందిన విద్యార్థులు జులై 24 నుంచి 26 వరకు కేటాయించిన కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. లేదా సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇక ఆగస్టు 10 నుంచి తరగతులు స్టార్ట్ అవుతాయి. పాలీసెట్ 2025 ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు లేదా 7995865456, 7995681678, , 9177927677 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ తరువాత కూడా సీట్లు మిగిలితే వాటిని స్పాట్ అడ్మిషన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఈ విషయంపై సాంకేతిక విద్యాశాఖ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంటుంది.