ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాల కోసం ఈ నెల (ఏప్రిల్ 27, 28) తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సోమశేఖర్‌రావు తెలిపారు. పోస్టల్ శాఖ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఏపీలోని పోస్టల్ విభాగంలో మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 46 మల్టీటాస్కింగ్ పోస్టులు, 19 పోస్ట్‌మ్యాన్, 03 మెయిల్ గార్డు పోస్టులు ఉన్నాయి.
* పరీక్ష విధానం:
రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. మెదటి పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, రెండో పరీక్ష 2.30 నుంచి 4.30 వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోప్రశ్నకు ఒకమార్కు.
– వీటిలో జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.