AP-TET Hall Ticket Download 2024 : ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

AP-TET Hall Ticket Download 2024 : ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2024 లింక్ విడుదల అయింది. ఏపీ టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP TET Hall Ticket Download 2024 Link Out on apcfss webiste

AP-TET Hall Ticket Download 2024 : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET)కు సంబంధించి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల (ఫిబ్రవరి) 23వ తేదీ నుంచి టెట్ అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, విద్యాశాఖ టెట్ అడ్మిట్ కార్డులను జారీ చేసింది.

ఈ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (aptet.apcfss.in) నుంచి తమ అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇటీవలే ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెల 8 నుంచి టెట్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

ఈ నెల 27 నుంచి పరీక్షలు.. మార్చి 14న తుది ఫలితాలు :
ఏపీ టెట్ ప్రాథమిక కీని మార్చి 10న విడుదల చేయనున్నారు. దీనిపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను మార్చి 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. టెట్ తుది కీని మార్చి 13న విడుదల చేస్తారు. మార్చి 14వ తేదీన ఏపీ టెట్‌ తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వరకు వెయిటేజీ ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఏపీ డీఎస్సీ, ఏపీ టెట్‌ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహిస్తారు. ఏపీ టెట్‌ 2024 పరీక్షా విధానం మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు.

ఏపీ టెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసేందుకు ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లో అడ్మిట్ కార్డు లింక్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత తమ పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఏపీ టెట్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ లింక్‌ను క్లిక్ చేయండి. ఈ కిందివిధంగా ప్రయత్నించండి.

ఏపీ టెట్ హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ చేయాలంటే? :

  • అధికారిక వెబ్‌సైట్‌ aptet.apcfss.inకి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో ఏపీ టెట్ ఫిబ్రవరి అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
  • అడ్మిట్ కార్డ్‌ని యాక్సెస్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
  • టెట్ హాల్ టిక్కెట్లను పరీక్షా కేంద్రానికి తప్పక తీసుకెళ్లాలి.

Read Also : Google Gmail Shutdown : ఆగస్టు 2024లో జీమెయిల్ పూర్తిగా నిలిచిపోనుందా? పుకార్లను నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చిన గూగుల్!

ట్రెండింగ్ వార్తలు