BITS Pilani Admissions
BITS Pilani Admissions : ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో పనిచేసే నిపుణుల కోసం బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (BITS) , పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (WILP) విభాగం, సంయుక్త ఆధ్వర్యంలో సరికొత్త కొత్త B.Tech డిగ్రీ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా కోర్ ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) రంగంలో ఉపాధి మార్గాలను అందించాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. టెలికమ్యూనికేషన్స్, సెమీకండక్టర్, IoT & ఎంబెడెడ్ సిస్టమ్స్, అనుబంధ డొమైన్‌ల వంటి కీలకమైన పరిశ్రమల్లో నిపుణులుగా రాణించేందుకు ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడనుంది.
READ ALSO : Heart Disease : మధుమేహం నుండి అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వరకు గుండె జబ్బులు రావటానికి 5 ప్రమాద కారకాలు !
అర్హతలు ;
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్స్ వంటి స్పెషలైజేషన్‌లో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉన్నవారు ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
మొత్తం ఏడు-సెమిస్టర్ లలో ఈ డిగ్రీ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. ఫౌండేషన్ సైన్సెస్, కోర్ టెక్నాలజీలు , ఎగ్జిక్యూషన్ మేనేజ్‌మెంట్ కలగలిపి ఉంటుంది. ఒకవైపు ఉద్యోగంలో విధులు నిర్వర్తిస్తూనే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కోర్సును కొనసాగించవచ్చు.
READ ALSO : Cancer Heart Disease Vaccines : క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు!
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 11, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bits-pilani.ac.in/ పరిశీలించగలరు.
నైపుణ్యం కలిగిన నిపుణులకు అధిక డిమాండ్ ;
భారతదేశం ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో, ముఖ్యంగా బలమైన సెమీకండక్టర్ వ్యవస్థను రూపొందించడంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. పరిశోధన , మార్కెట్ల అంచనా ప్రకారం భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధి దశలో ఉంది. 2022 అర్ధిక సంవత్సరం నుండి 2026 ఆర్ధిసంవత్సరం వరకు 19.7 శాతం CAGR వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
READ ALSO : Eating Cashew : వారంలో రెండు సార్లు కొద్ది మోతాదులో జీడిపప్పులు తింటే గుండె జబ్బులు దరిచేరవా ?
వినియోగదారుల నుండి పెరుగుతున్న డిమాండ్‌తో, పారిశ్రామిక యంత్రాలు, ఆటోమొబైల్స్, టెలికమ్యూనికేషన్ పరికరాలు , ఆఫీస్ ఆటోమేషన్ వంటి పరిశ్రమలు సెమీకండక్టర్ మార్కెట్ వృద్ధిని వేగవంతం అవుతుంది. 5G మరియు 6G టెలికాం నెట్‌వర్క్‌లు, లిథియం మైనింగ్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమలు కూడా రాబోయే సంవత్సరాల్లో మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, అగ్రికల్చర్, సెమీకండక్టర్, ఆటోమొబైల్ ,టెలికమ్యూనికేషన్ వంటి వివిధ EEE డొమైన్-సంబంధిత పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన పని నిపుణుల అవసరం ఉంటుంది.
READ ALSO : Heart Health : ఈ ఆహారాలు రోజువారిగా తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరే ఛాన్స్ తగ్గుతుంది!
ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌లకు నైపుణ్యం మెరుగు పరుచుకోవడం అవసరం. దీనికి అనుగుణంగానే బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (BITS) , పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (WILP) విభాగం, బి.టెక్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. దీని ద్వారా నిపుణుల సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది.