Horticulture MSc and PhD courses
SKLTSHU Admission : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ,సిద్దిపేట జిల్లా ములుగులో 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంఎస్సీ (హార్టికల్చర్)లో మొత్తం 32 సీట్లు ఉన్నాయి. స్పెషలైజేషన్లు – సీట్ల వివరాలకు సంబంధించి ఫ్రూట్ సైన్స్ – 08, వెజిటబుల్ సైన్స్ – 11, ఫ్లోరికల్చర్ & ల్యాండ్‌స్కేపింగ్ – 08, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ & ఆరోమాటిక్ క్రాప్స్ – 03. ప్రభుత్వ సంస్థలు/ సర్వీసులో ఉన్న అభ్యర్థులకు 2 సీట్లు కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2023 స్కోరు సాధించిన వారు అర్హులు.
READ ALSO : వాట్సాప్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండిలా
పీహెచ్‌డీ (హార్టికల్చర్) 08 సీట్లు ఉన్నాయి. స్పెషలైజేషన్లు – సీట్లు వివరాలకు సంబంధించి ఫ్రూట్ సైన్స్ – 02, వెజిటబుల్ సైన్స్ – 02, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్ – 01, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ & ఆరోమాటిక్ క్రాప్స్ – 01. ప్రభుత్వ సంస్థలు/ సర్వీసులో ఉన్న అభ్యర్థులకు 2 సీట్లు కేటాయించారు. సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించిన వారు దరఖాస్తుకు అర్హలు
వయోపరిమితి 40 సంవత్సరాలకు మించరాదు. దరఖాస్తు ఫీజుగా రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. The Comptroller, Sri Konda Laxman Telangana State Horticultural University, payable at Mulugu (V&M), Siddipet District’ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డిడి తీసుకోవాలి.
READ ALSO : Karonda Cultivation : ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడి..పెట్టుబడి లేని కరొండ సాగు
సీటు కేటాయింపు విధానం ;
విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్ధులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 20.11.2023గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్, పరిపాలనా కార్యాలయం, SKLTSHU, ములుగు, సిద్దిపేట జిల్లా. 502 279.
READ ALSO : Benefits of Peanuts : వేరుశెనగ గింజలు తినటం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే !
దరఖాస్తు విధానం ;
దరఖాస్తుతోపాటు జతచేయాల్సిన పత్రాల వివరాలకు సంబంధించి.. ఈ అడ్మిట్ కార్డు ఏఐసీఈ-జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2023, ఐసీఏఆర్-2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కులు/ర్యాంకు వివరాలు, పీజీ మార్కుల మెమో/కన్సాలిడేట్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ పరీక్ష ప్రొవిజినల్/డిగ్రీ సర్టిఫికేట్, 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్/ పదోతరగతి సర్టిఫికేట్, దివ్యాంగులకు అవసరమైన సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్ ,ఆధార్ కార్డు, అలాగే అభ్యర్థులు ప్రవేశ సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలన్నీ కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్యరుసుముతో నవంబరు 22 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.skltshu.ac.in/ పరిశీలించగలరు.