Admissions : ఐఎంయూ సెట్ 2022 ప్రవేశాలకు దరఖాస్తులు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ప్రోగ్రాములను అనుసరించి ఇంటర్వీడియట్ , బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

Imu (1)

Admissions : ఇండియన్ మారిటైం యూనివర్శిటీ (ఐఎంయూ)లో వివిధ ప్రొగ్రాముల్లో ప్రవేశాలకు ఐఎంయూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022పేరుతో నిర్వహించనుంది. ఈ నేపధ్యంలో అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అండర్ గ్యాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్, బీఎస్సీ నాటికల్ సైన్స్, తదితరాలు ఉన్నాయి. పీజీ ప్రోగ్రాములకు సంబంధించి ఎంబీఏ పోర్ట్, షిప్పింగ్ మేనేజ్ మెంట్, ఎంటెక్ డ్రెడ్జింగ్, హార్బర్ ఇంజనీరింగ్ తదితరాలు ఉన్నాయి. పీజీ డిప్లొమా కోర్సులకు సంబంధించి మెరైన్ ఇంజినీరింగ్, పీహెచ్ డీ అండ్ ఎంఎస్ రీసెర్చ్ ప్రొగ్రామ్ తదితర కోర్సులు ఉన్నాయి.

ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ప్రోగ్రాములను అనుసరించి ఇంటర్వీడియట్ , బీఈ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు మే 16, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.imu.edu.in/సంప్రదించగలరు.