Gurukul Colleges : తెలంగాణా గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు

ఇంటర్మీడియట్ లో చేరాలనుకునే విద్యార్ధులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ లో 2021-22లో పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్ధులు 2021-2022లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

Gurukul Colleges : తెలంగాణాలోని గురుకుల విద్యాసంస్ధల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల అడ్మీషన్లకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. 2022-23 విద్యాసంవత్సరానికి బీసీ గురుకుల కాలేజీల్లో ఇంటర్ , డిగ్రీల్లో చేరాలనుకునే విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డ్రిగ్రీలో ప్రవేశానికి బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు జూన్ 5, 2022న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంట్రన్స్ పరీక్షలో అభ్యర్ధులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల అధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు.

ఇంటర్మీడియట్ లో చేరాలనుకునే విద్యార్ధులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ లో 2021-22లో పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్ధులు 2021-2022లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కుటుంబానికి సంవత్సర అదాయం గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు 1,50,000, పట్టణ ప్రాంత విద్యార్ధులకు 2,00,000రూ మించి ఉండరాదు. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు mjptbcwreis.telangana.gov.in పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు