Scholarships
Scholarship : భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఎస్సీతోపాటు ఇతర విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ప్రోగ్రామ్ క్రింది 26.50లక్షల రూపాయలను స్కాలర్ షిప్స్ గా అందజేయనున్నారు. ఎస్సీ విద్యార్ధులతోపాటు, అర్హులైన ఇతర విద్యార్ధులు కూడా స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతకు సంబంధించి తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్ధులు, ఒకటి నుండి పదో తరగతి చదువుతున్న ఇతర విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్ధులకు అందించనున్న స్కాలర్ షిప్స్ వివరాలకు సంబంధించి ఎస్సీ విద్యార్ధులకు ఏడాదికి 3500రూ. నుండి 7000రూ , ఇతర విద్యార్ధులకు ఏడాదికి 3500రూ నుండి 8000రూ చెల్లిస్తారు. దివ్యాంగ్ జన్ విద్యార్ధులకు అదనంగా మరో 10శాతం అలవెన్సు రూపంలో చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://socialjustice.gov.in/ పరిశీలించగలరు.