ఏపీలో నాన్-గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల

  • Publish Date - February 22, 2019 / 11:18 AM IST

ఏపీలోని పలు ప్రభుత్వ సర్వీసుల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి.. మార్చి 28 నుంచి ఏప్రిల్ 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫీజు మాత్రం ఏప్రిల్ 16లోగా చెల్లించాలి. 

* నాన్ గెజిటెడ్ పోస్టులు:

టెక్నిక‌ల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్‌)   08
టెక్నిక‌ల్ అసిస్టెంట్ (హైడ్రోజియాల‌జీ)  01
టెక్నిక‌ల్ అసిస్టెంట్ (మైన్స్ అండ్ జియాల‌జీ స‌ర్వీస్‌)  08
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స‌ర్వే  01
టెక్నిక‌ల్ అసిస్టెంట్ (ఆర్కియాల‌జీ అండ్ మ్యూజియ‌మ్స్ స‌ర్వీస్‌)  03
వెల్ఫేర్ ఆర్గనైజ‌ర్‌  01
మొత్తం పోస్టులు  22

* విద్యా అర్హతలు:

                        పోస్టులు                          అర్హత
  టెక్నిక‌ల్ అసిస్టెంట్  & జియాల‌జీ స‌ర్వీస్‌  MSC, M-TECH, BSC(జియోలజీ).
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స‌ర్వే డిప్లొమా (సివిల్ ఇంజినీర్)
టెక్నిక‌ల్ అసిస్టెంట్ (ఆర్కియాల‌జీ అండ్ మ్యూజియ‌మ్స్ స‌ర్వీస్‌) PG, డిగ్రీ  (ఆర్కియాలజీ/ హిస్టరీ/ ఇండోలజీ/ ఆంథ్రోపాలజీ/ మ్యూజియాలజీ/ సంస్కృతం/ పర్షియన్)
వెల్ఫేర్ ఆర్గనైజ‌ర్‌ ఇంటర్ ఉత్తీర్ణత, ఎక్స్-సర్వీస్‌మెన్‌గా పనిచేసి ఉండాలి.

   
 * వయసు పరిమితి:
01.07.2019 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. వెల్ఫేర్ ఆర్గనైజ‌ర్‌ పోస్టులకు మాత్రం మాత్రం 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

* దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్‌ కార్డుదారులు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 

* ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల ద్వారా. రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. దరఖాస్తుల ఆధారంగా స్క్రీనింగ్ పరీక్ష తేదీలను వెల్లడించనున్నారు. మెయిన్ పరీక్షను జూన్ రెండోవారంలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25 వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు. 

* ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 28.03.2019.
ఫీజు చెల్లించడానికి చివరితేది 16.04.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 17.04.2019.
స్క్రీనింగ్ పరీక్ష తేది  వెల్లడించాల్సి ఉంది.
మెయిన్ పరీక్ష తేది  జూన్ 2వ వారంలో.