SAIL Recruitment
SAIL Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటటిఫికేషన్ ద్వారా మొత్తం 239 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇస్కో స్టీల్ ప్లాంట్ బర్నపూర్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Donkey Farm : గాడిదల ఫాం తో లక్షల్లో అదాయం పొందుతున్న యువరైతు !
భర్తీ చేయనున్న అప్రెంటిస్ ఖాళీలలో ఎలక్ట్రిషియన్ 65, ఫిట్టర్ 57, రిగ్గర్ 18, టర్నర్ 12, మెషినిస్ట్ 15, వెల్డర్ 32, కంప్యూటర్/ఐసీటీఎస్ఎం 6, ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ 16, మెకానిక్ మోటార్ వెహికల్ 5, ప్లంబర్ 6, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్) 7 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 7000 నుంచి రూ. 7.700 స్టైపెండ్ చెల్లిస్తారు.
READ ALSO : Azolla Cultivation : పశువుల దాణాగా…అజోల్లా సాగు
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 29, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sail.co.in/ పరిశీలించగలరు.