APPSC Notifications 2025: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

APPSC Notifications 2025: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

Appsc has released a notification for the posts of Agriculture Officer.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన, పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
జోన్-Iలో 08 పోస్టులు
జోన్-IIIలో 02 పోస్టులు

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు 19/08/2025 నుంచి మొదలు
దరఖాస్తు గడువు 08/09/2025తో పూర్తవుతుంది

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01/07/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇతర అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి B.Sc. (Agriculture) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు:

  • తప్పనిసరిగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) పూర్తి చేసుకోవాలి.
  • సమర్పించిన దరఖాస్తులు తాత్కాలికంగా పరిగణించబడతాయి.
  • తప్పుడు సమాచారం ఇస్తే దరఖాస్తు రద్దు అవుతుంది.
  • హాల్ టికెట్ల కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.