APPSC Group-1 Mains
APPSC Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి పోస్టును పదోతరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు వయోపరిమితి వర్తిస్తుంది.
రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.32,670ల నుంచి రూ.1,40,540ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది నవంబర్ 2, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://psc.ap.gov.in/ పరిశీలించగలరు.