Site icon 10TV Telugu

APPSC Job Notification: త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌.. అటవీ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు

APPSC Job Notification Releasing Soon

ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత శాఖల నుంచి రోస్టర్‌ పాయింట్లు వచ్చినందున ఈ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. అంతేకాకుండా.. అటవీ శాఖలోనే 100 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఇతర శాఖలకు చెందిన మరో 75 పోస్టులకు మొత్తం 175 పోస్టులకు నోటిఫికేషన్‌లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో 100 సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ మాత్రం మరో వారం రోజుల్లో విడుదల కానుంది.

శాఖల వారీగా పోస్టుల వివరాలు:

ఇక పైన తెలిపిన పోస్టులకు గాను ఆయా విభాగాల సిలబస్ ప్రకారంగా ఉమ్మడి పరీక్షను నిర్వహించనున్నారు. అయితే, కొంతమంది అభ్యర్తలు వేరు శాఖల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలంటి పరిస్థితిలో అన్నిటికీ కలిపి ఉమ్మడి పరీక్షా నిర్వహించడం సాధ్యం కాదు. ప్రస్తుతం దీనిపైనే చర్చలు కొనసాగుతున్నయి. త్వరలోనే తుది ప్రకటన వెలువడుతుంది.

Exit mobile version