APSLPRB : టుడే ఎస్ఐ ఆన్సర్ కీ

  • Publish Date - February 25, 2019 / 03:03 AM IST

ఏపీ పోలీసు శాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ఆన్సర్ కీ విడుదల కానుంది. తుది ఫలితాలు రెండు రోజుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవలే నిర్వహించిన ఈ ఉద్యోగాల తుది రాత పరీక్షకు 96.14 శాతం క్యాండిడేట్స్ హాజరయ్యారని బోర్డు పేర్కొంది. ప్రాథమిక ప్రవేశ పరీక్ష, దేహ దారుఢ్య పరీక్షల్లో 32,755 మంది అర్హత సాధించినట్లు తెలిపింది. వీరికి విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇందులో 1,266 మంది గైర్హాజర్ అయ్యారని, ఆన్సర్ కీ, తుది రాత పరీక్షలో అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 28లోగా రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు మెయిల్‌ చేయవచ్చని బోర్డు సూచించింది.